

అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మెగా నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల ప్రేయసితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల దుబాయ్లో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుపుకున్న ఈ జంట, ఇప్పుడు హైదరాబాద్లోని తమ నివాసంలో సంప్రదాయబద్ధంగా ‘పసుపు దంచుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మరియు బంధువులు హాజరయ్యారు. సుస్మిత, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, అల్లు అర్జున్ సతీమణి స్నేహ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సాధారణంగా హల్దీ వేడుకను గ్రాండ్గా నిర్వహిస్తారు. అయితే అల్లు కుటుంబం ఈ కార్యక్రమాన్ని సింపుల్గా, ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు శిరీష్ వివాహ తేదీ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.. మార్చి 6, 2026 న ఈ జంట వివాహం జరగనుంది. ఇక్కడ విశేషమేమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా. అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడం అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. గత సంవత్సరం అక్టోబర్ 31 న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!