
టెక్నాలజీ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “ఈసారి ప్రదర్శన బద్ధలైపోద్ది” అనే నినాదంతో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నేపథ్య సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు ట్రైలర్ విడుదల కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!