
గాసిప్స్

యంగ్ హీరో రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ ట్రైలర్‌ను రష్మిక మందన్నా ఈరోజు లాంచ్ చేశారు. నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్ అడవి యువకుడిగా భిన్న లుక్‌లో కనిపిస్తాడు. మూగ-చెవిటి డాన్సర్ ప్రేయసిని వికృత మనస్తత్వం ఉన్న పోలీస్ ఆఫీసర్ (బండి సరోజ్ కుమార్) నుంచి కాపాడే యుద్ధమే కథ.
రామాయణ శైలి కథనం, అడవి విజువల్స్, రోషన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, సాక్షి మదోల్కర్ పాత్ర, కాల భైరవ స్కోర్ అన్నీ కలిపి ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పటికే టీజర్, పాటలకు వచ్చిన క్రేజ్‌తో ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు ఆకాశానికి ఎత్తేసింది. డిసెంబర్ 12 న రిలీజ్ కానున్న ఈ సినిమా రోషన్ కెరీర్లో గేమ్ ఛేంజర్‌గా కనిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!