

తెలుగు సినిమా జర్నలిస్టుల సంక్షేమానికి పని చేస్తున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA), నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ అసోసియేషన్లో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న 221 మంది సభ్యులు ఉన్నారు.
వై.జె. రాంబాబు నూతన అధ్యక్షుడిగా, ప్రసాదం రఘు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా నాయుడు సురేంద్ర, ఉపాధ్యక్షులుగా జె. అమర్ వంశీ, వి. ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శులుగా జీవి, సురేష్ కొండి ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: వై. రవిచంద్ర, ఎం. చంద్రశేఖర్, ఫణి కందుకూరి, డా. చల్లా భాగ్యలక్ష్మి, బి. వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల్, కె. సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం.
TFJA సభ్యులు మరియు వారి కుటుంబాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలు మరియు పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. వై.జె. రాంబాబు నాయకత్వంలోని నూతన కార్యవర్గం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందని, ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సభ్యుల వృద్ధికి కృషి చేస్తారని తెలిపారు.
సభ్యులు సలహాలు, సూచనలకు ఈవిధంగా సంప్రదించవచ్చు:
Mail ID: tfja18@gmail.com
Phone Number: +91 72778 45678




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!