

దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ–2 తో విశేష గుర్తింపు పొందిన నటుడు నిఖిల్ ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 20 వ చిత్రం స్వయంభుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రానికి దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.
అత్యున్నత నిర్మాణ విలువలు, బలమైన పాన్ ఇండియా విజన్‌తో రూపొందుతున్న స్వయంభు నిఖిల్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వేసవి సెలవుల సీజన్‌కు ఇది అనువైన విడుదల తేదీగా చిత్ర బృందం భావిస్తోంది.
ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, భారతదేశంలోని అగ్రశ్రేణి విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాయి. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో, కావాల్సినంత సమయం తీసుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ అవుట్‌పుట్ ఇవ్వడానికి మేకర్స్ పూర్తి కట్టుబాటుతో పనిచేస్తున్నారు.
స్వయంభు నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం. కార్తికేయ–2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్ సొంతం చేసుకున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిస్థాయి శారీరక మార్పు సాధించడంతో పాటు, తీవ్రమైన శిక్షణను కూడా తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ అంచనాలను పెంచింది.
టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పని చేస్తుండటం మరో విశేషం. దర్శకుడు రాజమౌళితో ఐకానిక్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన కె.కె.సెంటిల్ కుమార్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను ఎం. ప్రభాహరన్, రవీంద్ర నిర్వహిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!