

మణి తెల్లగూటి దర్శకత్వంలో, రాధిక–శ్రీనివాస్ నిర్మిస్తున్న త్రికాల చిత్రంలో శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైథలాజికల్ టచ్ కలిగి ఉన్న ఫిక్షనల్ జానర్ చిత్రాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సమయంలో వస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని డిసెంబర్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రిత్విక్ వేట్షా సమర్పణలో శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా పనిచేస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీన్స్, అజయ్ విశ్వరూపం, శ్రద్దా దాస్ మేకోవర్, అలాగే శక్తివంతమైన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క ట్రైలర్‌తోనే చిత్రానికి భారీ హైప్ ఏర్పడింది. ఉత్తర భారతదేశంలో కూడా ట్రైలర్ ప్రభావంతోనే త్రికాల వ్యాపారం ముగియడం విశేషం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్దన్ రామేశ్వర్ త్రికాల కథ నచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం స్పిరిట్, పూరీ–విజయ్ సేతుపతి వంటి పాన్-ఇండియా ప్రాజెక్టులపై పనిచేస్తున్నప్పటికీ, ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యడంతో ప్రమోషన్స్ వేగవంతం చేస్తూ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని టీమ్ భావిస్తోంది. త్రికాల చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!