
గాసిప్స్

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోని రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలో నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, శివాజీ పలు ఇంటర్వ్యూలలో తన పాత్రను స్వయంగా ధృవీకరించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘లెనిన్’లో తాను ఎతిరాజులు అనే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. కథలో హీరో లెనిన్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన క్యారక్టర్ ఇదేనని పేర్కొన్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!