

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావ్ బహదూర్’ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన సత్యదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్‌ను ఆదరిస్తారని, భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను థియేటర్లలో చూసి ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు.
అదే విధంగా ఇతర భాషల ప్రేక్షకులు కూడా ‘రావ్ బహదూర్’ చిత్రాన్ని ఆదరిస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని సత్యదేవ్ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటిన చిత్రాలుగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ పేర్లు వినిపిస్తుంటే, భవిష్యత్తులో ఆ జాబితాలో ‘రావ్ బహదూర్’ పేరు కూడా చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సత్యదేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!