

సమంత చాలా రోజుల తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత. ఈ మూవీతో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, తర్వాత జూన్ 19కు వాయిదా పడింది.
ఇదే సమయంలో విజయ్ నటిస్తున్న జన నాయకన్ కూడా జూన్ 19న విడుదలయ్యే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సీఎం అయిన తర్వాత విజయ్ నటిస్తున్న తొలి సినిమా కావడం, ఇదే ఆయన చివరి సినిమా కావచ్చనే టాక్‌తో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. దీంతో సమంత సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విడుదల తేదీ మార్పుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!