

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది లోని మొదటి సింగిల్ “చికిరి చికిరి” విడుదలైన క్షణం నుంచి డిజిటల్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట సోషల్ మీడియా, యూట్యూబ్లో దూసుకెళ్లి భారీ స్పందన అందుకుంది. తాజాగా ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల పైన వ్యూస్ దాటుతూ మరో ఘనత సాధించింది.
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట భాషా, సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు వెర్షన్ ఒక్కటే దాదాపు 64 మిలియన్ల వ్యూస్ సాధించగా, హిందీ వర్షన్ 25 మిలియన్లు దాటింది. తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు కలిపి మరో 10 మిలియన్ల వ్యూస్ తీసుకొని వచ్చాయి. దీంతో “చికిరి చికిరి” పాట పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ పాటకు అదనపు హైప్ తెచ్చింది రామ్ చరణ్ స్క్రీన్ పై కనబరిచిన ఎనర్జీ, రస్టిక్ డాన్స్ మూమెంట్లే. అభిమానులు ఆయన స్టెప్పులను విపరీతంగా రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో రీల్స్, ఎడిట్స్ పెడుతున్నారు. బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న, వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ది చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. మొదటి సింగిలే ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!