

సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్వీయ జీవిత చరిత్రను రచిస్తున్నట్టు ఆయన కుమార్తె సౌందర్య వెల్లడించారు. రజనీకాంత్ ఆటోబయోగ్రఫీ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రచన దశలో ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ 2026 చివర్లో లేదా 2027 లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పుస్తకంలో రజనీకాంత్ బాల్యం నుంచి మొదలుకుని బస్ కండక్టర్‌గా చేసిన ఉద్యోగం, సినిమాల్లోకి ఆయన అడుగుపెట్టిన విధానం, తొలి చిత్రాలు, సూపర్ స్టార్‌గా ఎదగడంలో ఎదురైన కష్టాలు, పోరాటాలు వివరంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఆయన కుటుంబ జీవితం, భార్య లతా, పిల్లలు, రాజకీయాల్లోకి రావాలనుకున్న సందర్భాలు, ఆధ్యాత్మిక జీవితం, గురువులు, రామకృష్ణ మఠం ప్రభావం వంటి అంశాలూ ఇందులో పొందుపరచనున్నారు. ఈ పుస్తకాన్ని రజనీకాంత్ స్వయంగా రాస్తుండగా, కొంత భాగాన్ని ఓ ఇంగ్లీష్ రచయిత సహాయంతో సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!