
సినిమాలు

ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి మృతికి నటుడు రజనీకాంత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్బీ చౌదరి నిర్మాణ సంస్థలో తాను నటించకపోయినా, తమ మధ్య మంచి స్నేహబంధం కొనసాగిందని తెలిపారు.
నాలుగు నెలల క్రితం ‘జైలర్ 2’ చిత్రీకరణ సమయంలో ఆర్బీ చౌదరి తనను సంప్రదించారని రజనీకాంత్ వెల్లడించారు. “99వ చిత్రం నిర్మిస్తున్నా. 100వ సినిమా పూర్తి చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. ఆ చిత్రంలో మీరు నటించాలి” అని కోరారని చెప్పారు. అందుకు తాను అంగీకరించినట్లు తెలిపారు. ఉదయ్పుర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి మంగళవారం మరణించారు. ఆయన నిర్మిస్తున్న 99వ చిత్రం ‘మకుటం’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!