

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది నుండి రెండో సింగిల్ “రై రై రా రా” విడుదలై అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి” పాటకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ కొత్త పాట మాస్ తాలూకు ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
రామ్ చరణ్ తన ప్రత్యేకమైన శైలి, నృత్య కౌశలంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అందించిన వినూత్న నృత్య విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే నెల 30 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఘనంగా విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!