

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న నారి నారి నడుమ మురారి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ చిత్రాన్ని సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాపై టీజర్, పాటలతోనే మంచి హైప్ ఏర్పడగా, తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.
ట్రైలర్ కథ గౌతమ్ అనే బీటెక్ ఆర్కిటెక్ట్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత ప్రేయసితో ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితం, మాజీ ప్రేమికురాలి రీఎంట్రీతో గందరగోళంగా మారుతుంది. రెండు కాలాల్లో రెండు ప్రేమ కథలతో శర్వా డబుల్ షేడ్స్‌లో అదరగొట్టాడు. సమ్యుక్త, సాక్షి వైద్యల నటన ఆకట్టుకోగా, నరేష్, సత్య, సునీల్, సంపత్ రాజ్ ల హాస్యం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. వినోదభరిత కథనంతో ఈ సినిమా సంక్రాంతికి ఫుల్ ఫన్ ప్యాకేజ్‌గా నిలవనుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!