

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ నేడు థియేటర్లలో విడుదల కానుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1860లలో బ్రిటిష్ పాలన సమయంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా విడుదలకు ముందు నటుడు నాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సందేశం చిత్రబృందంపై తనకున్న అభిమానాన్ని చాటడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
విజయ్ దేవరకొండ నటనలో వచ్చిన మార్పును నాని ప్రత్యేకంగా ప్రశంసించారు. సాధారణంగా కనిపించే కూల్ లుక్ నుంచి ‘రణబాలి’ పాత్రలోని ఉగ్రరూపానికి విజయ్ మారిన తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విస్తృత పరిశోధనతో పాటు సూక్ష్మ వివరాలకు ప్రాధాన్యమిస్తూ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ప్రతిభను కొనియాడారు. సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన రష్మిక మందన్న కూడా ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారని నాని ప్రశంసించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!