యువజన ఉత్సవాల రెండో రోజు సందర్భంగా నిన్న రాత్రి ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ‘యువగళ – 2కే26’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడా మరియు సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభావంతమైన ప్రదర్శనలు కనబరిచారు. నృత్యం, సంగీతం, గాన ప్రదర్శనలతో పాటు ఖోఖో, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి.
ఈ వేడుకలకు ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణెదల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఆమె నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రాకాస’ చిత్రం గ్లింప్స్ మరియు పాటను యువగళ వేదికపై విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనుదీప్ దేవ్ మరియు సాహితీ గాలిదేవరలతో సంగీత విభావరి కార్యక్రమాన్ని ఆకట్టుకుంది.
ప్రముఖ సినీ హీరో సంగీత్ శోభన్ విశిష్ట అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ బోనం కనకయ్య, చైర్పర్సన్ డాక్టర్ బోనం కనకదుర్గ విద్యార్థులు మరియు నిర్వాహకులను అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి. మహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ & ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ. ప్రవీణ్, కార్యనిర్వహణాధికారి ఏవీఆర్వీ ప్రసాద్‌తో పాటు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!