
.jpg&w=3840&q=75)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు ఘన విజయం సాధిస్తూ అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ విజయోత్సాహం మధ్యనే చిరంజీవి తదుపరి సినిమా పై ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో 158వ సినిమాగా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను 2026 జనవరి 25న అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మెగా 158గా పిలవబడుతున్న ఈ చిత్రం, చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనుందని ప్రచారం జరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారులో సరదా పాత్ర తర్వాత ఈసారి పవర్ఫుల్ మాస్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించనుండగా, సినిమాటోగ్రాఫర్‌గా నిమిష్ రవి, సంగీత దర్శకుడిగా థమన్ పనిచేయనున్నారు. అధికారిక లాంచ్ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!