
జనరల్

వైజయంతి మూవీస్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించింది. ప్రస్తుతం సినిమా బడ్జెట్లో అధిక భాగం నటీనటుల సౌకర్యాలు, ప్రయాణాలపైనే ఖర్చవుతున్న తరుణంలో కమల్ హాసన్ ప్రైవేట్ చార్టర్ విమానాలకు బదులుగా ఎకానమీ ఫ్లైట్లో షూటింగ్లకు హాజరవుతున్నారని వెల్లడించింది.
కల్కి 2898 ఏడీ పార్ట్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన కమల్ హాసన్ సింపుల్ ట్రావెల్ పద్ధతిని వైజయంతి మూవీస్ ప్రత్యేకంగా కొనియాడింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో కమల్ ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలో మరింత పవర్ఫుల్గా కనిపించనున్నారు. మరోవైపు ప్రభాస్ త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!