

మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ గతేడాది ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా సూపర్‌హీరో పాత్రలో కనిపించిన ఆమె, తన నటనతో ప్రేక్షకులు, సినీ ప్రముఖుల ప్రశంసలు పొందారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సరసన ‘ప్రళయ్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి తనకు అత్యంత ఇష్టమైన సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కమల్ హాసన్ నటించిన ‘మైఖేల్ మదన కామ రాజన్’ తనకు ఎప్పటికీ ఇష్టమైన చిత్రమని కళ్యాణి తెలిపారు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, ఇందులో కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారని ప్రశంసించారు. సినిమాలోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలోనూ ఇలాంటి స్వచ్ఛమైన హాస్యంతో కూడిన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!