
గాసిప్స్

వారణాసి సినిమాను అవతార్ తో పోల్చడంపై స్పందించారు. విజువల్స్ పరంగా వారణాసి.. అవతార్ లా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. దానిపై జక్కన్న మాట్లాడుతూ.. ' జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ, ఆయనతో నన్ను పోల్చకండి. ఆయన ఒక శిఖరం లాంటివారు. ఒక మాస్టర్.. నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థినే' అని తెలిపారు. అంతేకాకుండా వారణాసి గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడుతున్నాం. వారణాసి నిడివి 3 గంటల 20 నిముషాలు ఉంటుంది. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టాలి. 3 నిముషాలు బోర్ కొట్టించినా ప్రేక్షకుడు ఫోన్ పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా తెరకెక్కిస్తున్నాం. ప్రతి సీన్ కొత్త అనుభూతిని ఇస్తుంది' అని చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!