

సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అలా బొలేలోకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ మలయాళ శైలి పాటలో నటి పూర్ణ డాన్స్‌తో పాటు రజినీకాంత్ ప్రత్యేకమైన స్వాగ్ వాక్ ఆకట్టుకున్నాయి. పూర్తి పాటను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
జైలర్‌లో కావాలయ్య పాటతో తమన్నా తెచ్చుకున్న స్థాయిలో పూర్ణ ఈ పాటకు క్రేజ్ తీసుకురాగలరా అనే చర్చ మొదలైంది. మరోవైపు అనిరుధ్ వాయిస్ కూడా అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం కొన్ని సన్నివేశాల ఆధారంగా పాటపై తుది నిర్ణయం తీసుకోవడం సరికాదని మరికొందరు అంటున్నారు. పూర్తి పాట వచ్చాకే అసలు స్పందన ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!