

సినిమా పాటల్లో శృంగార భావాలను జోడించడం సాధారణమే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అతిగా ఉన్న పదాలు వివాదాలకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం ప్రముఖ గేయరచయిత అనంత్ శ్రీరామ్ కూడా అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలోని ప్రత్యేక గీతానికి ఆయన రాసిన పదాలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పాటలో ద్వంద్వార్థ పదాలు, అసభ్యకరంగా భావిస్తున్న వ్యాఖ్యలు ఉండటంతో కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, కథ అవసరాన్ని బట్టి పాటలు రాయడం వృత్తిలో భాగమని అనంత్ శ్రీరామ్ గతంలోనే వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘పెద్ది’ పాట కారణంగా మళ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొందరు కావాలనే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అభిమానులు అంటుండగా, మరికొందరు ఇటువంటి పదాలు ఉన్న పాటలు గతంలో కూడా వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లో ఇటీవల వివాదానికి దారితీసిన ‘సర్కే చునార్ తేరీ’ పాట ఉదాహరణను కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!