

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ నటిగానే కాకుండా సింగర్‌గా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ‘ట్రైన్’, ‘ఆకాశంలో ఒక తార’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం డబ్బేనని శృతి హాసన్ వెల్లడించారు. స్వతంత్ర సంగీత ఆల్బమ్‌లను రూపొందించుకోవడానికి డబ్బు అవసరం కావడంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ చిత్రం ‘లక్’లో నటించే అవకాశం వచ్చినప్పుడు, తన సంగీత ప్రయోగాలకు అవసరమైన డబ్బు కోసం వెంటనే అంగీకరించానని శృతి చెప్పారు. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో నటన తన ప్రధాన వృత్తిగా మారిందని వివరించారు. బాలనటిగా తన తొలి అనుభవం గురించి మాట్లాడుతూ, తండ్రి కమల్ హాసన్ దర్శకత్వం వహించిన ‘హే రామ్’ చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక వృత్తిపరమైన విషయాల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారని, తండ్రితో షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో ఆయన కోసమే ఆ సినిమాలో నటించానని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!