

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకోగా, ఎలిజిబెత్ పాత్రలో హుమా ఎంట్రీతో ఆసక్తి మరింత పెరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో మిస్టరీ, ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తూ, కథలో ఆమె పాత్ర ప్రాధాన్యతను సూచిస్తోంది.
హుమా ఖురేషి పాత్రపై దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ, ఈ క్యారెక్టర్‌కు ప్రత్యేకమైన నటనా సామర్థ్యం, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ అవసరమని తెలిపారు. హుమా కూడా ఈ సినిమా ఒక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్ విజన్‌తో ఇది మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!