

పతంగ్ చిత్ర బృందం నుంచి తాజాగా ఎమోషనల్ డ్రామా పాట విడుదలైంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ మరో వినూత్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న సినిమా పతంగ్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పతంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామాను సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లు నిర్మించాయి. నిర్మాతలుగా విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి వ్యవహరించారు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి రూపొందించిన ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, నటుడు వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయకుడు ఎస్పీ చరణ్ ఒక కీలక పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణ.
ఎమోషనల్ డ్రామా సాంగ్‌ను రిలీజ్ చేసిన సురేష్ బాబు మాట్లాడుతూ,
కొత్త తరానికి చెందిన యువ టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు. నాని బండ్రెడ్డికి మంచి క్రియేటివ్ విజన్ ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా స్టేడియంను తీసుకుని, భారీగా పతంగుల పోటీ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!