

వాలెంటైన్స్ డే సందర్భంగా యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం దీవానా స్టోరీ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శుభం సినిమాతో మంచి గుర్తింపు పొందిన హర్షిత్ రెడ్డి, ఈసారి ఒక గాఢమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ARHA మీడియా, వి స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. దీవానా ఈ వేసవిలో భారీగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
స్టోరీ పోస్టర్లో హీరో ప్రేమలో మునిగిపోయిన భావోద్వేగాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ప్రేమ అనేది ఎంచుకునే విషయం కాదు, అది సహజంగా జరిగే మత్తు అని, ఆ ప్రేమ హృదయాన్ని నింపినప్పుడు నిజమైన ‘దీవానా’ పుడతాడని హీరో భావవ్యక్తీకరణ ఆకట్టుకుంటుంది. కొత్త లుక్‌లో హర్షిత్ రెడ్డి మెప్పించగా, ఈశ్వర్ చంద్ర నేపథ్య సంగీతం విజువల్స్‌కు మరింత మాయాజాలాన్ని జోడించింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!