

బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 గ్రాండ్ ఫినాలే టెలివిజన్ చరిత్రలోనే ప్రత్యేకమైన విజయంగా నిలిచిందని హోస్ట్ అక్కినేని నాగార్జున తెలిపారు. ఈ సీజన్‌కు వచ్చిన రేటింగ్స్ ట్రేడ్ వర్గాలనే కాకుండా, తనను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయని ఆయన వెల్లడించారు.
స్టార్ మా ఛానల్లో 19.6 టీవీఆర్ నమోదు కాగా, జియోస్టార్ ప్లాట్ఫామ్లో 285 మిలియన్ నిమిషాల వ్యూయింగ్ నమోదుకావడం విశేషమని నాగార్జున పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ఆదరణ పొందిన బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నాగార్జున తన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ సీజన్ ఎమోషన్స్, ప్యాషన్, పోటీ భావం, గొడవలు, మరచిపోలేని క్షణాలతో నిండిపోయిందని అన్నారు. కంటెస్టెంట్ల కృషి, ప్రొడక్షన్ టీమ్ అంకితభావం, అలాగే లక్షలాది మంది ప్రేక్షకుల మద్దతు వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందని తెలిపారు.
స్టార్ మా, ఎండెమోల్ షైన్ బృందాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకుల ప్రేమే ఈ కార్యక్రమానికి అసలైన బలం అని నాగార్జున భావోద్వేగంగా పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!