

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. తన కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మమిత బైజు, ప్రియమణి, శృతి హాసన్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ వేగంగా సాగుతున్న ఈ సినిమా జనవరి 9న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో వేగం పెంచిన టీమ్, కొత్త ఫోటోషూట్ స్టిల్స్‌తో విజయ్ లుక్‌ను రెవీల్ చేసింది. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పోస్టర్లకన్నా ఇవే బెటర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక సంగీత ప్రమోషన్ల విషయానికి వస్తే— చిత్రబృందం సెకండ్ సింగిల్‌ను డిసెంబర్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!