.png&w=3840&q=75)

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరియు దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ధురంధర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించగా, తాజాగా చిత్రబృందం మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేసింది. ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఊపేసిన బాంబే రాకర్స్ ప్రసిద్ధ పాట ‘ఆరి ఆరి’ను ఆధునిక హంగులతో రీమిక్స్ చేసి కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాట విడుదలతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది.
ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పవర్ఫుల్ బీట్స్‌తో రీమిక్స్ చేశారు. రణ్వీర్ సింగ్ తన ఎనర్జీ మరియు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే 310 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ట్రైలర్ తర్వాత, ఈ కొత్త పాట విడుదలతో సినిమా ప్రమోషన్లు మరింత వేగం పుంజుకున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇందులో రణ్వీర్ సింగ్ జస్కీరత్ సింగ్ రంగీ మరియు హమ్జా అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారత గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అలాగే 18వ తేదీ సాయంత్రం నుంచే భారీ స్థాయిలో పెయిడ్ ప్రివ్యూలను ప్రదర్శించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే ఈ చిత్రం మంచి స్పందనను అందుకుంటూ, ‘స్త్రీ 2’ పేరిట ఉన్న రికార్డులను అధిగమిస్తూ కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!