

స్వప్న సినిమాస్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఛాంపియన్’ తో తెలుగులో లాంచ్ కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హీరోయిన్ అనస్వర రాజన్ తెలిపారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రంలో రోషన్‌తో కలిసి నటించిన ఆమె, చంద్రకళ పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని అన్నారు. తెలుగు భాషపై పూర్తి పట్టు లేకపోయినా, దర్శకుడు ప్రదీప్ అద్వైతం సహా యూనిట్ మొత్తం ఇచ్చిన సపోర్ట్ వల్ల డైలాగ్స్ బాగా పలకగలిగానని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ తనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
‘ఛాంపియన్’ కథ వినగానే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యానని, మంచి సినిమాకి అవసరమైన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అనస్వర తెలిపారు. పీరియాడ్ బ్యాక్‌డ్రాప్, వింటేజ్ కాస్ట్యూమ్స్, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని చెప్పారు. ‘గిరగిరా’ పాటకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చిందని, రోషన్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని తెలిపారు. రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!