

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ విడుదలకు సిద్ధమవుతున్నారు. జూన్ 26న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన రిటైర్మెంట్ గురించి స్పందించారు. ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించే ఆలోచన లేదని, రిటైర్మెంట్ అనే పదం తన నిఘంటువులో లేదని స్పష్టం చేశారు. జీవితాంతం పనిచేయడమే ఆరోగ్యకరమైన జీవన విధానమని, మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే మనిషి రిటైర్ కావాలని వ్యాఖ్యానించారు.
తన వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని వివరించిన అక్షయ్ కుమార్, షూటింగ్‌కు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలనిపించే సందర్భాలు ఉన్నప్పటికీ, తన కోసం ఎదురుచూసే వందలాది మంది సిబ్బంది గుర్తుకొస్తారని చెప్పారు. గత 36 ఏళ్లుగా అదే క్రమశిక్షణతో జీవిస్తున్నానని తెలిపారు. ఒకవేళ సినిమాలకు దూరమైతే ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గా, డాగ్ వాకర్‌గా, తోటమాలిగా లేదా ఇంటి పనులు చూసుకునే వ్యక్తిగా మారాల్సి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే సినిమా షూటింగ్లకే వెళ్లడం తనకు అత్యుత్తమ ఎంపిక అని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!