

ఖరీదైన జిమ్ మెంబర్షిప్లు లేదా కఠినమైన వర్కౌట్ల అవసరం లేకుండానే రోజుకు 10 – 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం, సూర్య నమస్కారం శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా పనిచేయించడంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించే ఆధ్యాత్మిక సాధనగా కూడా పనిచేస్తుంది. సూర్య నమస్కారాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెటబాలిజాన్ని పెంచి క్యాలరీలు వేగంగా దహించబడేలా చేసి, మొండి కొవ్వును క్రమంగా తగ్గిస్తాయి. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల చర్మానికి సహజ కాంతి వస్తుందని, ముఖ ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు ఇది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!