

చెరకు రసం సహజ చక్కెరలతో నిండిన పానీయం. ఒక గ్లాసు రసంలో సుమారు 40–50 గ్రాముల చక్కెర ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసాన్ని దూరంగా ఉంచాలి. అలాగే ఒక గ్లాసులో దాదాపు 180 కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రతికూలంగా మారి శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది.
రోడ్డు పక్కన విక్రయించే చెరకు రసం పరిశుభ్రత పరంగా ప్రమాదకరం కావచ్చు. శుభ్రం చేయని యంత్రాలు, కలుషితమైన మంచు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తాగితే విరేచనాలు లేదా ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో కామెర్లకు సూచించినప్పటికీ, ఫ్యాటీ లివర్ లేదా సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. అందుకే కాలేయ రోగులు వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.
చెరకు రసం దంతాలకు సులభంగా అంటుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి దంత క్షయం, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సెన్సిటివ్ దంతాలు ఉన్నవారు తాగిన వెంటనే నోటిని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగే బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇది గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను పెంచవచ్చు. గ్యాస్ట్రిటిస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు చెరకు రసం బదులు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!