

ఫ్రోజెన్ చికెన్‌ను తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోసిన చికెన్‌ను ప్రత్యేక రసాయనాలు లేదా తక్కువ ఉష్ణోగ్రతల్లో నెలల తరబడి నిల్వ ఉంచి విక్రయించడమే ఫ్రోజెన్ చికెన్ అని డాక్టర్లు వివరిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో సమయం లేక చాలామంది ఫ్రోజెన్ మాంసాహారాల వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే ఇది దీర్ఘకాలంలో అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువకాలం ఫ్రీజ్ చేసిన చికెన్ జీర్ణం కావడం కష్టమై గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఈ విషయంపై పోషకాహార నిపుణులు మాట్లాడుతూ, ఫ్రోజెన్ ప్రక్రియలో చికెన్‌లోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తగ్గిపోతాయని చెప్పారు. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని చికెన్‌లో సాల్మొనెల్లా, ఈ-కోలి వంటి బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రిజర్వేటివ్స్, యాంటీబయాటిక్స్, హార్మోన్లు వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఫ్రోజెన్ చికెన్‌కు దూరంగా ఉండాలని, సాధ్యమైనంతవరకు తాజా చికెన్‌ను మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!