ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ లభించే బూడిద గుమ్మడికాయ కేవలం వంటలో ఉపయోగించే కూరగాయ కాదు, అది ఒక అద్భుతమైన ఆరోగ్య సర్వోత్తమ ఔషధంగా పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం, ఈ కాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండె, కాలేయం, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బూడిద గుమ్మడికాయ విటమిన్ A, C, పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండి, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
జ్యూస్ తయారీకి 2 నుండి 4 కిలోల బరువు కలిగిన మీడియం సైజ్ కాయలను ఎంచుకోవడం మంచిది. ముందుగా కాయపై ఉన్న తెల్లని బూడిదను శుభ్రం చేసి, ముక్కలుగా కత్తిరించి, జూసర్లో నేరుగా వేసి జ్యూస్ తయారు చేయాలి. మిక్సీ ద్వారా తయారుచేయాలనుకుంటే, ముక్కలను చిన్నగా కత్తిరించి కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్ చేసుకుని, దానిని వడకట్టడం ద్వారా జ్యూస్ తీసుకోవచ్చు. తొక్క, గుజ్జు, గింజలను తొలగించకూడదు, ఎందుకంటే వీటిలో కూడా ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
జ్యూస్ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం, ఆకలి లేకుండా, తాగిన తర్వాత కనీసం ఒక గంట ఏమీ తినకూడదు. వయస్సుకు సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలంతా ఈ జ్యూస్ తాగవచ్చు. ప్రారంభంలో తక్కువ మోతాదుతో అలవాటు చేసుకోవడం మంచిది. తాగలేని వారు ఒక స్పూన్ తేనె లేదా కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగవచ్చు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలున్నవారు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడానికి ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!