

వైద్యులు, పోషకాహార నిపుణుల ప్రకారం బ్రోకలీ ఒక పోషకాల పవర్హౌస్. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా బ్రోకలీలో ఉండే సల్ఫోరఫేన్ అనే సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఇందులోని గ్లుకోసినోలేట్స్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
అదే విధంగా బ్రోకలీలో కాల్షియం, విటమిన్ K ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. డైటరీ ఫైబర్ పేగుల పనితీరును మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం, ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే బ్రోకలీని బాగా ఉడికించి తీసుకోవాలని, పచ్చిగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!