

రక్తపోటు సమస్య అంటే కేవలం గుండె, మెదడుకు సంబంధించినదే కాదు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మహిళల్లో బీపీ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు అది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి నెలసరి ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల కార్టిసాల్, అడ్రినలిన్, ఆల్డోస్టెరాన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల స్థాయిల్లో మార్పులు వచ్చి పీరియడ్స్ క్రమరహితంగా మారే అవకాశం ఉంటుందని వైద్యుల అభిప్రాయం.
అదే సమయంలో, అధిక బీపీ గర్భాశయం మరియు అండాశయాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను దెబ్బతీసి అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే పరిస్థితికి దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిని అమెనోరియా అని పిలుస్తారని తెలిపారు. మరోవైపు తక్కువ రక్తపోటు ఉన్న మహిళల్లో నెలసరి సమయంలో తలతిరగడం, నీరసం, మూర్ఛ, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. కాబట్టి క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!