

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం నాని తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని కండలు పెంచి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టంగా కనిపిస్తోంది.
మొదట ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని భావించారు. తర్వాత ఆగస్టు 21వ తేదీకి మార్చారు. కానీ ఇప్పటికీ సగం వరకు మాత్రమే చిత్రీకరణ పూర్తయిందని, ఇంకా ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. దీనికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ రీ-రికార్డింగ్ మరియు సంగీత పనుల కోసం ఎక్కువ సమయం తీసుకుంటారనే పేరుంది.
ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగస్టు నుండి డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై చిత్ర బృందం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ సంస్థపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!