

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశిఖన్నా మరియు శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్–హరీష్ కాంబో కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్‌పై టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. మొదట మేకర్స్ ఏప్రిల్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్చి 19 లేదా 26 తేదీల్లో రిలీజ్ అవుతుందనే రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇందులో ఏ తేదీ నిజమో ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే, ఈ రెండు తేదీల్లో ఏదైనా ఫైనల్ అయితే పెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ తప్పదని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే మార్చి 19 న ‘టాక్సిక్’, మార్చి 26 న ‘ది ప్యారడైజ్’ వంటి పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌పై పడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!