

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ప్రకటించిన 173వ సినిమా ఇటీవల భారీ అంచనాలు రేపింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నట్లు ముందుగా ప్రకటించారు.
అయితే అనూహ్యంగా సుందర్ సి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో, తమిళ సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా ఆగలేదని, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారమే త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ దర్శకుడు లేకుండా సినిమా ఎలా మొదలవుతుంది? సుందర్ సి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నా, సినిమా షూట్ మొదలవ్వబోతోందన్న వార్తలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ విషయంపై స్పష్టత కోసం అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






.png&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!