
క్రీడలు

యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్‌తో కలిసి డ్రాగన్ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ పాత్రను పూర్తిగా కొత్త లుక్‌లో డిజైన్ చేసినట్లు సమాచారం. పాత్రలో తీవ్రతను చూపించేందుకు ప్రత్యేక ఫిట్‌నెస్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.
ఈ ప్లాన్ ప్రకారం తారక్ నాలుగు నెలల పాటు కఠినమైన డైట్ పాటిస్తూ, రోజూ గంటల తరబడి వ్యాయామాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన సుమారు 15 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. ఆయన క్రమశిక్షణ యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసిందని టాక్. ప్రశాంత్ నీల్ కూడా తారక్ నిబద్ధతను ప్రశంసించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!