

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ భాగం కోసం మనోజ్ యాక్షన్ స్టంట్స్‌ను కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, క్లైమాక్స్‌లో ఓ ప్రత్యేక అతిథి పాత్ర ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
ఈ సినిమా కథ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనలపై ఆధారపడి ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ‘డేవిడ్ రెడ్డి’ జీవిత కథగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ‘వార్ డాగ్’ అనే భారీ బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కిలోలు ఉండగా, ఇది సినిమాలో ముఖ్యంగా కనిపించనుంది. ఈ చిత్రంలో మనోజ్ సరసన కోలీవుడ్ మూవీ ‘ప్రిన్స్’ హీరోయిన్ మరియా ర్యాబోషప్కా నటిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!