

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ అంచనాల చిత్రం ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా కథలో వచ్చే కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతిని అందిస్తాయని ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో కనిపించినట్లుగానే యంగ్ రజినీకాంత్‌ను జైలర్ గెటప్‌లో మరోసారి చూపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మొదటి భాగంలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన రజినీకాంత్‌తో కలిసి జైలు నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కనిపించనున్నారనే చర్చ నడుస్తోంది. గతంలో ముత్తువేల్ పాండియన్ తనకు చేసిన సహాయాన్ని శివరాజ్ కుమార్ పాత్ర వివరించిన నేపథ్యంలో, ఆ సంఘటనలను మరింత విస్తృతంగా చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక స్పష్టత లేదు. ఈ ప్రచారం నిజమైతే వెండితెరపై అభిమానులకు భారీ విందు ఖాయమనే చెప్పాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!