
.png&w=3840&q=75)
దళపతి విజయ్ ఇటీవలే తన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, దానికి ముందు ఆయన చివరి సినిమా "జన నాయకన్" ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్లుగా పూజా హెగ్డే, మమితా బైజు నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే, ఇది నందమూరి బాలకృష్ణ నటించిన "భగవంత్ కేసరి" రీమేక్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీసి, నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. "జన నాయకన్" టీమ్ ఈ రూమర్లను ఖండించకపోవడంతో, మరింత చర్చ మొదలైంది.
జూన్‌లో విజయ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌లో ఆయన పోలీస్ గెట్‌అప్‌లో కనిపించడం బాలకృష్ణ పాత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ "దళపతి కచేరీ" కూడా అభిమానుల్లో పోలికలు పెంచింది. పాటలో విజయ్ తన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ, పూజా హెగ్డే, మమితా బైజుతో జత కట్టారు. అభిమానులు వెంటనే “భగవంత్ కేసరి”లో కూడా ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్ ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో, కేవిఎన్ ప్రొడక్షన్స్ “భగవంత్ కేసరి” రీమేక్ హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేశారని టాక్ వస్తోంది. దీంతో రూమర్లు మరింత బలపడుతున్నాయి. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండగా, టీమ్ మాత్రం ఏ క్లారిఫికేషన్ ఇవ్వకపోవడంతో, ఇది రీమేక్‌నే అని అనిపిస్తోంది. "జన నాయకన్" సినిమా జనవరి 9న పొంగల్ స్పెషల్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, అదే రోజున తెలుగు వెర్షన్ "జన నాయకుడు" గా కూడా విడుదల అవుతోంది. ఇక అందరి దృష్టి ఇప్పుడు ఇది నిజంగానే “భగవంత్ కేసరి” రీమేక్నా కాదా అనే విషయంపై ఉంది.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!