
టెక్నాలజీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఓ కొత్త బజ్ వినిపిస్తోంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఈ పాత్ర చాలా భావోద్వేగంగా ఉండబోతుందని అంటున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుండగా, మరో ముఖ్య పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనుంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే, దర్శకుడు అట్లీ ప్రత్యేకంగా కొన్ని గెస్ట్ రోల్స్‌ను కూడా డిజైన్ చేస్తున్నాడట. వాటికి ఎవరు ఎంపిక అవుతారో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!