4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కల్కి 2 లో దీపికా ప్లేస్ లో స్టార్ హీరోయిన్‌..?

Writer: Bhargavi 12:51 PM, 28 జనవరి, 2026
కల్కి 2 లో దీపికా ప్లేస్ లో స్టార్ హీరోయిన్‌..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ చిత్రాలు సెట్స్‌ పై ఉండగా, వచ్చే ఏడాది మార్చిలో ‘స్పిరిట్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే, ‘కల్కి 2898 AD: పార్ట్‌ 2’ను కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించగా, ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుందని టాక్. ఈ సీక్వెల్‌ ప్రస్తుతం టాలీవుడ్‌-బాలీవుడ్‌ రెండింటిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దీపికా పదుకొణె స్థానంలో కొత్త హీరోయిన్ ఎవరు అన్న చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ‘కల్కి 2898 AD’ మొదటి భాగంలో దీపికా సుమతి పాత్రలో ఆకట్టుకున్నారు. కానీ షెడ్యూల్ సమస్యలు, రెమ్యునరేషన్ కారణాల వల్ల ఆమె ‘కల్కి 2’ నుంచి తప్పుకున్నట్టు 2025 లో ప్రకటించారు. దీని తర్వాత ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్, కళ్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజా బజ్ ఏంటంటే... ఈ కీలక పాత్రకు సాయి పల్లవి (Sai Pallavi) పేరు బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి తెలుగింటి అమ్మాయిగా సహజ నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. సాయి పల్లవి అయితే 'కల్కి 2' స్టోరీకి, ప్రభాస్‌కు జోడీగా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇది ఇప్పటికీ రూమర్ మాత్రమే, అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే.. 'కల్కి 2' హిందీ లో కూడా భారీ ప్రభావం చూపాలంటే హీరోయిన్ ఎంపిక కీలకం. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నుంచి, అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ నుంచి త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

2024 లో విడుదలైన 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచింది. ఆ అంచనాలను మించేలా సీక్వెల్‌ను తెరకెక్కించాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ ఫైనలైజేషన్ ఆలస్యం కావడంతో షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత టైమ్ పట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి దీపికా పదుకొణె ఔట్ అయిన తర్వాత సాయి పల్లవి ఇన్ అవుతారా? లేక మరో స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వస్తుందా? అన్నది మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకూ సస్పెన్స్‌గానే ఉండనుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం... 'కల్కి 2898 AD: పార్ట్ 2'పై హైప్ మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

ట్యాగ్లు
ప్రభాస్కల్కి 2898 ADసాయి పల్లవినాగ్ అశ్విన్టాలీవుడ్ వార్తలుసినిమా అప్‌డేట్స్వైజయంతి మూవీస్దీపికా పదుకొణె
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!