

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండగా, హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాకై ప్రేక్షకులు, మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన లుక్‌ను విడుదల చేసి మంచి స్పందన పొందారు. హాలీవుడ్ నటులు కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను రాజమౌళి #గ్లోబ్ ట్రాట్టర్ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటున్నారు. అలాగే ఈ నెల 15న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ పేరిట భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఇటీవల ఒక సాంగ్‌తో పాటు ప్రియాంకా చోప్రా లుక్‌ను కూడా విడుదల చేశారు. చీరకట్టులో ఆమె లుక్ వైరల్ అయ్యింది. దీనిపై పాన్–ఇండియా స్టార్ మాధవన్ స్పందిస్తూ, “వావ్ వావ్… బ్రిలియంట్! వాట్ ఎ లుక్! రోజురోజుకీ మీ ప్రభావం అద్భుతంగా పెరుగుతోంది” అని కామెంట్ చేశారు. అప్పటికే విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌పై కూడా ఆయన స్పందించి, ఆ పాత్రలో ఆయనను చూడటానికి ఆత్రుతగా ఉన్నానన్నారు. మాధవన్ వరుసగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్పై స్పందిస్తుండటంతో, ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజంగా అలాంటిదేనా అనేది చూడాలి మరి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!