

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరియు నటుడు విజయ్ వర్మ మధ్య జరిగిన బ్రేకప్ ఇప్పటికీ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారి విడిపోవడానికి గల అసలు కారణాలు అధికారికంగా బయటకు రాకపోయినా, వ్యక్తిగత జీవితంపై భిన్న అభిప్రాయాలే కారణమన్న ప్రచారం జరుగుతోంది. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని తమన్నా భావించగా, కెరీర్‌పై దృష్టి పెట్టాలని విజయ్ వర్మ నిర్ణయించుకోవడంతో విభేదాలు వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
లస్ట్ స్టోరీస్ 2 సమయంలో వీరి రిలేషన్షిప్ వార్తలు మొదలై, తర్వాత ఇద్దరూ డేటింగ్లో ఉన్నామని అంగీకరించారు. బ్రేకప్ అనంతరం తమన్నా సినిమాలు, ఐటెం సాంగ్స్‌తో బిజీగా ఉండగా, విజయ్ వర్మ వెబ్ సిరీస్‌లు మరియు ఇతర ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కొత్త చర్చలకు దారితీసింది. ఒక యువతి చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేసి ఖుషి అహుజా అనే అకౌంట్‌ను ట్యాగ్ చేయడంతో ఆయన మళ్లీ ప్రేమలో పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!