

రష్మిక నటించిన థామా సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం, మరోవైపు శ్రీలీల లీడ్ రోల్ లో అరుంధతి హిందీ రీమేక్ అనే చర్చ మొదలవ్వడం దాదాపు ఒకేసారి జరిగాయి. దీంతో అరుంధతి రీమేక్ పై ఆసక్తికర చర్చ మొదలైంది. బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ ను రష్మికతో తెరకెక్కిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. రీమేక్ పై అధికారికంగా ప్రకటన రాకముందే, ఇలా ఆసక్తికర చర్చ మొదలవ్వడం విశేషం.
బాలీవుడ్ లో ఇప్పటికే తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది రష్మిక. ఇక శ్రీలీల విషయానికొస్తే, ఆమె ఇప్పుడే అడుగుపెట్టింది. ఆమెకు క్రేజ్ రావాలంటే తొలి హిందీ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. అన్ని లెక్కలు వేసుకునే బదులు, కళ్లముందు కనిపిస్తున్న రష్మికతో అరుంధతి రీమేక్ తెరకెక్కిస్తే, అదిరిపోతుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అనుష్క ను మ్యాచ్ చేసే లక్షణాలు, టాలెంట్ రష్మికకు మాత్రమే ఉన్నాయనేది వీళ్ల వాదన. మరోవైపు శ్రద్ధా కపూర్ లేదా అలియా భట్ అయితే ఇంకా బాగుంటుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ చర్చంతా ఇక్కడివరకే. బాలీవుడ్ లో అరుంధతి రీమేక్ పై పెద్దగా బజ్ లేదు.











కామెంట్స్ (1)
Rashmika rules again