
.png&w=3840&q=75)
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ – ఓటీటీ రైట్లతోనే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్లో!
రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విడుదలకు ముందే పెద్ద బిజినెస్ సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కలిపి సుమారు ₹7 కోట్లు, అలాగే ఆడియో రైట్స్ ₹3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రధానంగా, ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు ₹14 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్లోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ బోర్డు ఇప్పటికే చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలుగా ఫిక్స్ అయింది.
ఓటీటీ రిలీజ్ డేట్:
థియేటర్ విడుదలైన 4 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం కుదిరింది. అందువల్ల, ‘ది గర్ల్ ఫ్రెండ్’ డిసెంబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ ముందు లేదా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.
సోనాక్షి సింహా జటాధర – జీ5లో డిసెంబర్లో స్ట్రీమింగ్!
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మైథలాజికల్, హార్రర్ కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ జోనర్లో సినిమాను ట్రై చేశారు సుధీర్ బాబు. అదే జటాధర. ధన పిశాచిని, లంకె బిందెలు, నిధులు, నిక్షేపాల చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించిన ‘జటాధర’ సినిమా కూడా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. ట్రేడ్ టాక్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి తెలుగు రాష్ట్రాల్లో ₹6 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం ₹8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జటాధర ఓటీటీ వివరాలు:
‘జటాధర’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఈ సినిమా దక్షిణాది భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అంటే, డిసెంబర్ మొదటి వారంలో తెలుగు వెర్షన్, డిసెంబర్ చివరి వారంలో హిందీ వెర్షన్ జీ5లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్‌ను బట్టి రిలీజ్ తేదీలు ముందుకు లేదా వెనుకకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. జీ5 త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!